
బిగ్ బాస్ సీజన్ 4 చివరి రెండు వారాల్లో ఉంది. ఇంట్లో ఇంకా ఆరుగురు మాత్రమే మిగిలారు. వీళ్ళల్లోనించి ఒకరు ఈ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వనున్నారు. ఆ తర్వాత టాప్ 5 లో నిల్చిన వారి నుంచి ఒకరు విన్నర్ మరియు ఒకరు రన్నరప్ గా నిలవనున్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కింగ్ క్వీన్ టాస్క్ లో ఇంటి సభ్యులు హద్దులు మిరారు. కింగ్ క్వీన్ అయినా వాళ్ళు ఇంటి నియమాలను తమకు ఇష్టమొచ్చినట్లు మార్చచ్చని బిగ్ బాస్ చెప్పటంతో చెలరేగిపోయారు. మొదట సోహెల్ కింగ్ అవ్వగా ఆ తరువాత అభిజీత్ ఆ తరువాత హారిక క్వీన్ అయింది. అయితే హారిక క్వీన్ గా ఉన్న సమయంలో మాట్లాడుతూ మాట్లాడుతూ హారికకు సోహెల్ ముద్దు పెట్టాడు. దీంతో రాణికి ఎలా ముద్దు పెడతావ్ అంటూ హారిక అడగగా రాణి అందంగా ఉందంటూ సోహెల్ సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా సోహెల్ చేసిన పనికి హారిక ఒక్కసారిగా షాక్ అయింది.