
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన, మంచి ఆహారం తీసుకున్నా సరే ఎటు నుంచి వచ్చి వేటు వేస్తుందో తెలియని పరిస్థితి. అల..అనీ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కుదరదు. మరి ముఖ్యంగా మీడియా సంస్థలు ఎల్లకాలం, ఎటువంటి పరిస్థితుల్లో అయిన విధులు నిర్వహించక తప్పదు. అయితే కరోనా కష్టకాలంలో కూడా తమ విధులు నిర్వహిస్తున్న మీడియా సిబ్బందిలో యాంకర్ బిత్తిరి సత్తి ఒకరు. తీన్మార్ వార్తలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిత్తిరీ సత్తి తన మాటలతో, చెమత్కారంతో, హావభావాలతో వార్తలు చెప్తూ అందరిని అలరిస్తూ వచ్చారు. తాజాగా సాక్షి టీవీలో చేరి గరంగరం వార్తలు చెప్తున్న సత్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్నిరోజులుగా నిద్రపట్టకపోవడం, కాస్త జ్వరంగా ఉండటంతో అనుమానం వచ్చి కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ గా తెలిందని సత్తి తెలిపారు. అయితే ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాని, నాతో పని చేసిన టీం సభ్యులు కూడా హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపారు. సత్తికి పాజిటివ్ అని తెలడంతో సాక్షి టీవీ హై అలర్ట్ అయింది. సత్తితో కొద్దీ రోజులుగా దగ్గరగా ఉన్నవారంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇకపోతే తాను పూర్తిగా కొలుకోని తిరిగొస్తానని బిత్తిరి సత్తి తెలిపారు.