
రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ఒళ్ళు మరిచి చిందులేస్తూ వీడియోలకు చిక్కి వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి సందర్భం కాదు. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నెల రోజుల నుంచి దుబాయ్ లో నిశ్చితార్థం ఏర్పాట్లు జరిగాయి. దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా లో నిశ్చితార్థం జరిగింది. ఈ ఈవెంట్ కు రాజకీయ ప్రముఖులందరు హాజరయ్యారు. ఇక కుమారుడికి సంబంధించిన ముఖ్య ఫంక్షన్ జరుగుతుంటే తండ్రి ఆగుతారా ? ఫుల్ జోష్ లో కనిపించారు సీఎం రమేష్. సంబరమంతా రమేష్ మొహంలో కనిపించింది. అదే జోష్ లో పాట ఎటువంటిదైన స్టెప్పులతో అదరగొట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో బాపుగారి బొమ్మ పాటకు సతీమణితో కలిసి రమేష్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.