
బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో మనందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో నాకు పవన్ దేవుడితో సమానం అంటూ చెప్పాడు. సినిమాల విషయానికి వస్తే, బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలను నిర్మించాడు 'తీన్మార్','గబ్బర్ సింగ్'. తీన్మార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ గబ్బర్ సింగ్ రికార్డులు కొల్లగొట్టింది. ఆ తర్వాత బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్‌లు రాజకీయాల్లో బిజీ అయ్యి ఇప్పుడు 'వకీల్ సాబ్' తో పవన్ రిఎంట్రీ ఇవ్వనుండగా, 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బండ్ల రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా బండ్ల గణేష్, తనకు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఉన్నట్లుగా ట్వీటర్ ద్వారా తెలిపారు. 'నాకు దేవుడు పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే, పవన్ అభిమానులు ఏడాది మొత్తమ్ పండగ చేసుకునేలా తీస్తా ' అంటూ ట్వీట్ చేసారు.