
కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన 'కత్తి / ఖైదీ' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. హిందీ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్నారు. ఈ రీమేక్ తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బాలీవుడ్లో కూడా నిర్మాణ సంస్థగా ఎంట్రీ ఇవ్వనుంది. గత సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదలైన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ, తన కుమార్తెను మొదటిసారి కలవడానికి వెళుతున్న మాజీ దోషి యొక్క కథ. అతను తన గమ్యాన్ని చేరుకోవడానికి ముందు, అతను డ్రగ్ మాఫియా ముఠాను ఎదుర్కోవలసి ఉంటుంది. తన కూతురును కలుసుకునే ప్రయత్నంలో అతను ఎటువంటి పరిస్థితులను ఎదురుకున్నారుడు ? ఎలా కలుసుకున్నాడు ? అనేది దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. బలమైన కధ, కార్తీ నటనతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది.