
వచ్చే వారంలో వరుసగా నాలుగు రోజులు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు, రష్మీక జంటగా వస్తున్న "సరిలేరు నీకెవ్వరు". సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మెగా సూపర్ ఈవెంట్ పేరుతో చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ ఈవెంట్ లో బృందం ట్రైలర్ ను లాంచ్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే....అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అందరిని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే రష్మీక క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మహేష్ కామెడీ టైమింగ్, మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్...ఇలా ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలను ఇందులో పొందుపరిచనట్లు తెలుస్తుంది.