
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమంతో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. దర్శకుడు బోయపాటి స్క్రిప్టులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో 'సింహా', 'లెజండ్' సినిమాలలో చూపించినట్టుగా ఇందులో కూడా బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా రెగులర్ షూటింగ్ మొదలు కానుంది. బోయపాటి చివరిగా తెరకెక్కించిన సినిమా వినయ విధేయరామ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అందుకే బాలయ్య సినిమా కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను పరిశీలిస్తున్నారట. బోయపాటితో రకుల్ ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. అందుకే ఆమె అయితే కచ్చితంగా సినిమా చేస్తుందన్న నమ్మకంతో బోయపాటి ఆమెను అడిగాడట. మరి ఇంతకీ రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.