
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమంతో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. దర్శకుడు బోయపాటి స్క్రిప్టులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో 'సింహా', 'లెజండ్' సినిమాలలో చూపించినట్టుగా ఇందులో కూడా బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా రెగులర్ షూటింగ్ మొదలు కానుంది. ఫిలిం నగర్ లో టాక్ ప్రకారం ప్రొడ్యూసర్ తో బోయపాటి, బాలకృష్ణకు బడ్జెట్ రెమ్యునరేషన్ విషయంలో చిన్న క్లాష్ వచ్చిందట. అందుకనే ఇప్పుడు బోయపాటి శ్రీను బడ్జెట్ ను వీలైనంత కట్ చేస్తున్నారని తెలుస్తోంది. రులర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వటంతో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి ఎక్కుబ బడ్జెట్ కేటాయించేందుకు మొగ్గుచూపట్లేదట. దీంతో బోయపాటి బడ్జెట్ కట్ చేస్తున్నారట.