
తెలుగు నాట కూడా మంచి కలెక్షన్లు రాబట్టి సక్సెస్ అయిన తమిళ హీరోల్లో సూర్య ఒకరు. ఇదిలావుంచితే, తెలుగులో తనకున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని స్ట్రెయిట్ తెలుగు సినిమా ఒకటి చేయాలని సూర్య ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. ఈ విషయంలో గతంలో కొందరు దర్శకులను సంప్రదించడం.. కథలు వినడం కూడా జరిగింది. అయితే, ఇన్నాళ్లకు ఆయన కోరిక తీరుతోందని అంటున్నారు. ఆయన తెలుగులో నటించే సినిమా దాదాపు ఓకే అయిందనీ, దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడనీ తెలుస్తోంది. ఇటీవల బోయపాటిని కలిసినప్పుడు ఆయన చెప్పిన యాక్షన్ ఓరియెంటెడ్ కథ సూర్యకు బాగా నచ్చిందట. దాంతో ఆ ప్రాజక్టుకి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.