
కమెడియన్ సునీల్ తనకంటూ టాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అతని కామెడీ టైమింగ్, హుమర్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారి "అందాల రాముడు" సినిమాలో నటించాడు. అది కామెడీ బాగుండడంతో పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఆపై వచ్చిన సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. హీరోగా సునీల్ కు వచ్చిన గుర్తింపు తక్కువే. అందుకే తిరిగి కామెడీయన్ గా కెరియర్ కొనసాగించాలని డిసైడ్ అయ్యి చిత్రలహరి, చాణక్య వంటి సినిమాల్లో కామెడీయన్ గా కనిపించాడు. కానీ సునీల్ కామెడీ అంతగా పండలేదనే చెప్పలేదు. మరి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న "అల...వైకుంఠపురములో" మళ్ళీ కమెడియన్ గా కనిపించనున్నాడు. త్రివిక్రమ్, బన్నీకి సునీల్ కి మధ్య హిలెరియస్ కామెడీ ఉండేలా రాశారట. మరి ఇందులోనైనా సునీల్ కమెడియన్ గా తన సత్తా చాటుతాడో లేదో చూడాలి.