
సుకుమార్ కు చుక్కలు చూపిస్తున్న బన్నీ సినిమా
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ఒక సినిమా లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో సుక్కుకు అంతగా కలిసొస్తున్నట్లు లేదు. రంగస్థలం సినిమా పూర్తయ్యాక మొదటి మహేష్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో మహేష్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక అప్పుడు అల్లు అర్జున్ అయితే బాగుంటుందని భావించి అతనికి కధ చెప్తే బన్నీ కొన్ని మార్పులు చేర్పులు చెప్పించి మొత్తానికి ఒకే చేసాడు. సరే ఇంకా సినిమా సెట్ అయిందని అనుకుంటే ఇప్పుడు ఇంకో చిక్కొచ్చి పడింది. ఈ సినిమా కధ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగుతుంది. అందుకని షూటింగ్ ను శేషాచలం అడవుల్లోని చేయాలనీ పక్క ప్రణాళికతో ఉన్న సుకుమార్ కు తమిళనాడు ఆంధ్ర బార్డర్ ఫారెస్ట్ అధికారులు షాక్ ఇచ్చారు. దట్టమైన శేషాచలం అడవుల్లో షూటింగ్ చేయడం ప్రమాదకరమని పర్మిషన్ నిరాకరించారట. అత్యంత క్రూరమృగాలు ఉంటాయని అక్కడ హెసిటింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించి పర్మిషన్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో చేసేదేం లేకా బ్యాంకాక్ అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడట.