
ప్రదీప్ మాచిరాజు, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రదీప్ "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమాతో హీరోగా వస్తున్నట్లు తెలిసిందే. ప్రదీప్ హీరోగా వస్తుంటే అతని అభిమానులు పండగ చేసుకుంటుంటే...ఒకరు మాత్రం అతనిపై కేసు పెట్టాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై ఒక యువకుడు ఆదివారం కేసు నమోదు చేశాడు. కీసరలోని రాంపల్లి నివాసి శ్రీరామోజు సునిషిత్, బంజారా హిల్స్ పోలీసులను సంప్రదించి ప్రదీప్ మాచిరాజు సినిమాల్లో నటించకూడదని అన్నారు. ప్రదీప్ మాచిరాజు ఈ సినిమాలో నటించడం ద్వారా సిబిఎఫ్సి నిబంధనలను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నాడు. ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఏలా చిత్రంలో నటిస్తున్నారని తెలియగానే శ్రీరామోజు సునిషిత్ ప్రదీప్ మరియు చిత్ర దర్శకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.