
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో నిర్మాణాన్ని పరిశీలించేందుకు కార్యకర్తలతో, నేతలతో బయలుదేరిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఉండవల్లిలోని తన నివాసం నుండి కాంవోయ్ లో బయలుదేరిన చంద్రబాబు కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. అయితే దారి మధ్యలో అడ్డుకాసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. తన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం కోసం తమ వద్ద భూములు తీసుకొని ఇప్పటి వరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీ చేసిన ఫ్లాట్లు ఇవ్వలేదని, ఉచిత విద్య, వైద్యం సంగతి కూడా పట్టించుకోలేదని నల్ల జెండాలతో నిరసన తెలియచేశారు. దళిత రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నించారు. ఒక వర్గ రైతులు చంద్రబాబు కాంవోయ్ పై చెప్పులు విసిరారు. వారికి తోడుగా వైకాపా శ్రేణులు గో బ్యాక్ బాబు అంటూ నినాదాలు చేశారు.