
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ సంచలనం చాందిని చౌదరి 'మస్తి' అనే వెబ్ సిరీస్లో నవదీప్తో లిప్ లాక్ సిన్ చేయటం ఇప్పుడు టాక్ ఆఫ్ టౌన్ అయ్యింది. మ్యాటర్ ఏంటంటే, ఆహా ఓటీటీ లో క్రిష్ నిర్మిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘మస్తీ' ద్వారా, చాందిని చౌదరి ఓటీటి లోకి అడుగుపెట్టింది. మస్తీ కధ, కామం మరియు దురాశతో నడిచే ఆధునిక సంబంధాలపై నడుస్తోంది. ఇది ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది - బార్ యజమాని అడ్మాన్ ప్రణవ్ (నవదీప్), అతని భార్య (బిందు మాధవి), సూపర్వైసర్ ఆనంద్ (రాజు చెంబోలు), బార్ వెయిట్రెస్ లేఖా (చాందిని చౌదరి), బ్యాండ్ సింగర్ తాన్య (హెబ్బా పటేల్ ) మరియు మోడల్ సిమ్రాన్ (అక్షర గౌడ). నవదీప్ బార్ వెయిట్రెస్ అయిన పెళ్లికాని చాందిని చౌదరితో వివాహేతర సంబంధంలో ఉంటాడు. బిందు మాధవి చాలా కాలం విరామం తర్వాత తెలుగు పరిశ్రమలో రీఎంట్రీ ఇస్తుంది. ఈ వెబ్ సిరిస్ లొనే నవదీప్ తో చాందిని చౌదరి లిప్ లాక్ ఉంది. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.