
పార్టీల్లో ఉన్న తాము ఎదురుకుంటున్న సమస్యల గురించి, వాళ్లకు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. అలా తాజాగా టీడీపీ కడప నియోజకవర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా అందులో పలు కార్యకర్తలు గొడవకు దిగి కొట్టుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై దళిత కార్యకర్తలకు ఉన్న అసంతృప్తిని చెప్తున్న సమయంలో శ్రీనివాసులరెడ్డి మనుషులు దాడికి దిగారు. సుబ్బయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా అధినేత చంద్రబాబు ముందే జరిగింది. చంద్రబాబు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోకుండా కొట్టుకుంటూ, మాట మాట అనుకున్నారు. మేము అధికారంలో ఉన్నా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులమని చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. ఇదిలావుంటే టీడీపీలో వలసలు పెరుగుతున్నాయి. పార్టీపై అసంతృప్తితో పార్టీని విడి వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో చంద్రబాబు నేతలను కాపాడుకునే దిశగా ప్లాన్ చేస్తున్నారు.