
సిద్దార్థ్, 'బాయ్స్' మరియు 'బొమ్మరిల్లు' వంటి చిత్రాలతో ఒక సంచలనాన్ని సృష్టించాడు. సిద్ధార్థ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఇచ్చాడు. అప్పట్లో అమ్మయిలకు హార్ట్ త్రోబ్, ఒక సూపర్ స్టార్. కానీ కొన్ని సినిమాల ఎంపికల కారణంగా అతనికి చాలా సమయం పనిలేకుండా పోయింది. సుదీర్ఘకాలం తెలుగు సినిమా నుండి దూరంగా ఉన్న సిడ్ కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను చేశాడు. అలానే కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు కూడా రెడీ అయ్యాడు. ప్రస్తుతం 'ఇండియన్ 2' లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలానే, తమిళంలో మరో స్టార్ హీరో చిత్రంలో మరో పాత్రను కూడా చేస్తున్నాడు. సిద్ధార్థ్ స్టార్ స్టేటస్, స్టార్డంకు కన్నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే రోల్ చిన్నదైనా బాగుంటే చేసేస్తాడు. కానీ అతని అభిమానులు మాత్రం నిరాశ పడుతున్నారు. హీరోగా మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.