
ఈమధ్యకాలంలో టాలీవుడ్ లో హీరోల మధ్య మనస్పర్థలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక్కటై ముందుకు వెళ్తున్నారు. ఒకరి సినిమాల ఫంక్షన్లకు మరొకరు. మరొకరి ఈవెంట్లకు ఇంకొకరు. అలా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాని చాటిచెప్తున్నారు. ఇకపోతే ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో బిజినెస్ సెట్ అయ్యేందుకు హెల్ప్ చేస్తున్నాడు. అర్ధం కాలేదా ? తాజాగా అందరూ హీరోలు సినిమాలే కాకుండా సైడ్ బిజినెస్లు మొదలు పెడుతున్నారు. అలానే జూ. ఎన్టీఆర్ సైతం బిజినెస్ రంగంలోకి దిగే ప్లాన్ చేస్తున్నాడు. దానికోసం చరణ్ ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాడని టాక్. కొత్త టాలెంటెడ్ టెక్నీషన్స్ తో చిన్న సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ఈ మేరకు చరణ్ తన వద్ద ఏమైనా కొత్త కథలు వస్తే ఎన్టీఆర్ వద్దకు పంపుతున్నాడట. ఇక ఆ ప్రొడక్షన్ హౌజ్ కి తన కొడుకు, తండ్రి పేరులను కలిపి అభయ్ హరి ఆర్ట్స్ అని పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.