
చిరంజీవి తన సినిమాల ఎంపికను కేవలం స్క్రిప్ట్ ద్వారానే చేస్తారు. చరణ్ విషయంలో కూడా చిరు అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. చరణ్ ఏదైనా సినిమాకు అనుమతి ఇవ్వడానికి లేదా సంతకం చేయడానికి ముందు స్క్రిప్ట్ కచ్చితంగా వింటారు. కొంతకాలం క్రితం, చరణ్‌కు నూతన దర్శకుడు ప్రదీప్, స్క్రిప్ట్ వివరించాడు. అప్పటికే నటుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు, తుది నిర్ణయం కోసం, స్క్రిప్ట్ చిరంజీవికి వివరించబడింది. ఈ కథనం కొన్ని రోజుల క్రితం విన్న మెగాస్టార్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని కోరారని, మొత్తంగా ఓవరాల్ స్క్రిప్ట్ చాలా బాగుందని చిరు ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు అన్ని జరిగితే, ఇది ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత సెట్స్ పైకి వెళ్ళవచ్చు. కాబట్టి చరణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చింది, కానీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. దానికి కొంత సమయం పట్టె అవకాశం ఉంది.