
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం "మోసగాళ్లు" అనే సినిమాలో 'అను' అనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మోసగాళ్లు యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికొస్తే...కాజల్ అగర్వాల్ డేరింగ్ మరియు కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. రాబోయే ఈ చిత్రం "మొసగాళ్లు" ప్రపంచం మొత్తాన్ని కదిలించిన అతిపెద్ద ఐటి కుంభకోణం ఆధారంగా రూపొందించబడింది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఈ చిత్రం అద్భుతమైన కథాంశం, క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ తో రూపొందించబడుతుంది. గత ఏడాది నవంబర్ లో మేకర్స్ విష్ణు మంచు క్యారెక్టర్ 'అర్జున్' ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది. ముంబై సిటీలో రెండేళ్ల క్రితం జరిగిన ఐటి కుంభకోణంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు స్కామ్ చేసిన వ్యక్తిగా కనిపించనున్నాడు. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో సైతం విడుదల కానుంది.