
తీహార్ జైలు నుంచి బుధవారం రాత్రి 8గంటలకు బయటకొచ్చిన చిదంబరం మీడియాతో ముచ్చటించారు. ప్రధాని నరేంద్ర మోడీ కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి నిచ్చంగా ఉందని ఆరోపించారు. నేను జైలు నుంచి బయటకు రాగానే మొదట ఆలోచించింది 75లక్షల కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛ గురించేనని తెలిపారు. ఆగస్టు 4 నుండి స్వాతంత్ర్యమ్ కోల్పోయిన కాశ్మీర్ ప్రజల గురించి ప్రార్ధించనన్నారు. మన స్వేచ్ఛ కాపాడుకోవాలంటే వాళ్ల స్వేచ్ఛ కోసం కూడా పోరాడాలని కాశ్మీర్ ప్రజలను ఉదేశించి అన్నారు. ఇక తాను ఆర్ధిక మంత్రిగా ఎంతో మెరుగ్గా పని చేశానని చెప్పుకొచ్చారు. ఆ విషయం జర్నలిస్టులకు, అధికారులకు తెలుసన్నారు. ప్రధాని మోడీ ఆర్ధిక స్థితిపై ఎప్పుడు మౌనం వహిస్తూనే ఉన్నారని...ఆర్థిక వ్యవహారాలని మంత్రులకు అప్పగించారని దాని ఫలితమే ఈరోజు దేశ ఆర్థిక స్థితి అని ఆరోపించారు.