
సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ దశాబ్దాలుగా మంచి స్నేహితులు. కానీ తాజాగా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని నిర్ణయించుకుని పరిశ్రమ నిర్వహించిన సమావేశాలకు తనను ఆహ్వానించనందుకు బాలయ్య చిరుపై మాటల తూటాలు వదిలారు. దీంతో ఇద్దరి మధ్య ఒక చిన్న అంతరం ఏర్పడింది. అప్పటి నుండి, బాలకృష్ణ మరియు చిరంజీవిల మధ్య పోటీ హాట్ టాపిక్. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తుండగా, బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీనుతో జతకట్టారు. రెండు సినిమాలు త్వరలో షూట్లను తిరిగి ప్రారంభించనున్నాయి. అయితే రెండు సినిమాలు ఏప్రిల్ విడుదలపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి క్లాష్ తప్పేటట్లు లేదు. ఇది వరకు చిరు ఖైదీ నెంబర్ 150 మరియు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి ఒకేసారి సంక్రాంతి బరిలో నిలిచాయి. మరి ఇప్పుడు పోటీ ఎలా ఉంటుందో, ఎవరు గెలుస్తారో చూడాలి.