
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెలుగులో మంచి విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అదే జోష్ లో కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమాను మొదలు పెట్టాడు. ఇక సైరా సంబరాన్ని తన తోటి యాక్టర్స్ తో పంచుకున్న విషయం తెలిసిందే. 1980లలో ఉన్న నటి, నటీమణులు అందరిని ఒక చోటకి చేర్చి తన కొత్త ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అందరూ రెట్రో గెటప్స్ లో డ్రెస్ అయిన యాక్టర్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికి హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 9 రి యూనియన్ పార్టీలను రాధిక శరత్ కుమార్, మమ్ముట్టి లాంటి వాళ్ళు ప్లాన్ చేయగా 10వ రియూనియన్ మాత్రం తన ఇంట్లో జరగాలని భావించి తానే హోస్ట్ చేసాడు. అయితే ఈ పార్టీ నుండి చిరు అందాలభామ ఖుష్బూతో బంగారు కోడిపెట్ట పాటకు చిందులేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వయసులో కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.