
నూతన సవత్సరం సందర్భంగా "మా" అసోసియేషన్ వారు డైరీని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్, సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...."మా అసోసియేషన్ ఒకప్పుడిలా లేదు. రోజుకో సమస్య తెలెత్తుంది. అసోసియేషన్ కోసం యూఎస్ లో ప్రోగ్రామ్స్ నిర్వహించాం. అలానే మాలో 900మంది ఉన్నారు.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చెయ్యాలి.. ఫండ్స్ రైజ్ చెయ్యాలి. దీనికోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ లాంటి హీరోలను ముందుకు తీసుకురావాలి. హీరోలు కోటలల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ అసోసియేషన్ కోసం 10కోట్లు ఇవ్వలేరా అనడం సారి కాదు. డబ్బులు జనరేట్ చేయడం ముఖ్యం. మాలో మంచి గురించి మైక్ లో చెప్పుకుందాం, చెడు గురించి చెవిలో చెప్పుకుందామని తెలిపారు. చిరు మాట్లాడిన అనంతరం రాజశేఖర్ స్టేజ్ ఎక్కి అందరి కాళ్ళకి మొక్కి మైక్ తీసుకొని మాట్లాడారు. "నేను మా అసోసియేషన్ కోసం ఎంతో చేసాను. టెన్షన్ లో కారు యాక్సిడెంట్ కూడా జరిగింది. మాలో ఉన్న 26 మందిలో 18మంది ఒకవైపు, 8మంది ఒకవైపు ఉన్నారని" చిరు మాటలను తప్పుబడుతూ రాజశేఖర్ మాట్లాడటం దుమారం రేపుతున్నాయి. రాజశేఖర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని చిరు చెప్పారు. తన మాటకి విలువ ఇవ్వలేదని ఎమోషనల్ అయ్యారు.