
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య షూటింగ్ ను తిరిగి ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా అరగంట సేపు ఓ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. మరో పక్క నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా మొన్నీమధ్యనే మొదలు పెట్టారు. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఇద్దరి అగ్ర హీరోల సినిమాలు ఒకేరోజు వచ్చే వేసవిలో విడుదల కానునట్లు సినీ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం ఇదేమి మొదటిసారి కాదు. మరి ఈసారి పోటీ ఎలా ఉంటుందో ఎవరు గెలుస్తారు చూడాలి.