
కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో మెగాస్టార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య కథ మెరుగుపడుతున్న విధానం చూసి కొరటాల శివను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు చిరంజీవి. అంతేకాదు ఈ సినిమా తర్వాత మలయాళ హిట్ చిత్రం 'లూసిఫెర్' తెలుగు రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకుని చిరంజీవి హీరోగా తెరకెక్కించేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే....రామ్ చరణ్ స్టార్ స్టేటస్ వచ్చేంత వరకు చిరు దగ్గరుండి సినిమాలను ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. నాన్న వయసుకు, అనుభవంకు, స్టార్ డంకు తగ్గట్లుగా మంచి లైన్ అప్ ను సిద్ధం చేస్తున్నాడు. ఇది చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది.