మొదటిసారి పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి….ఫోటో వైరల్!

మెగస్టార్ చిరంజీవి నడిచిన బాటలో నడుస్తున్నారు ఇప్పటి మెగా హీరోలు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ తమ సినిమాల్లో ఎక్కడో ఒక దగ్గర మెగాస్టార్ పాటను, స్టెప్ ను ఇమిటేట్ చేయటం చూస్తుంటాం. అయితే అదే బాటలో వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుని విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ మ్యానేరిజమ్స్ ను మెగా హీరోలు ఎలాగైతే ఇమిటేట్ చేస్తుంటారో....అలానే, ఇండస్ట్రీలో యంగ్ హీరోలు పవన్ మ్యానేరిజమ్స్ ను ఇమిటేట్ చేస్తుంటారు. కానీ ఫర్ ఏ చేంజ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మ్యానరిజమ్ పబ్లిక్ గా ఇమిటేట్ చేయటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హీరో నిఖిల్ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం' చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ "ఈ చిత్రంలో విప్లవ వీరుడు చే గువేరాకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.చే గువేరా పేరు చెప్పగానే నాకు నా తమ్ముడు పవన్ గుర్తొచ్చాడంటూ మెడ మీద చెయ్యి వెయ్యగానే అభిమానులు ఈలలు, కేకలు వేశారు.