
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తికాగానే మలయాళ హిట్ 'లూసిఫర్' చిత్ర రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాకు మొదట సుజిత్ దర్శకత్వం వహిస్తాడాని తెలిసిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో చిరు సీనియర్ డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టారు. ఇదిలా ఉంటే, మెగాస్టార్ మరో హిట్ రీమేక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వేదాళం' మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో అజిత్ పాత్రను బాస్ పోషించడానికి మొగ్గుచూపుతున్నారట. అయితే అనుహ్యంగా ఈ సినిమాను ఫ్లాప్లతో బాధపడుతున్న మెహర్ రమేష్ చేతిలో పెట్టారట. మరి మెగాస్టార్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని మెహర్ వినియోగించుకుంటారో లేదో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ నెల 22న రానున్నట్లు తెలుస్తోంది.