
శాండల్‌వుడ్ యువ టాలెంట్ నటుడు చిరంజీవి సర్జా మరణం కన్నడ, సౌత్ సినీ ప్రేమికులందరికీ షాక్ ఇచ్చింది. అతని భార్య నిండు గర్భవతి. చిరంజీవి చనిపోయినప్పుడు ఆమె పడిన బాధ, ఆవేదనను ఎవరు మర్చిపోలేరు. తాజాగా చిరంజీవి సర్జా భార్య నటి మేఘన రాజ్ శ్రీమంతం జరిగింది. వారు చిరు ఉనికి కలిగేలా మేఘన కుర్చీ పక్కనే చిరంజీవి ఫోటో కట్ ఔట్ ను పెట్టారు. మేఘనా పక్కన నిలబడి ఉన్న దివంగత నటుడి కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ట్రెండ్ అవుతున్నాయి. మేఘన శ్రీమంతం ఫోటోలు చూసిన వారంతా కనీళ్లు అపుకోలేరు. భర్త పక్కన లేకపోయినా మొహం మీద చిరునవ్వు చేరగకుండా పుట్టబోయే బిడ్డ కోసం ధైర్యంగా ఉంటానని చెప్పకనే చెప్పింది మేఘన. ఆమెకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తూ ధైర్యంగా ఉండమని మనోధైర్యాన్ని అందిస్తున్నారు.