
ఈరోజు, బుల్లితెరపై తన నవ్వుతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న... మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈమేరకు నాగబాబు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తమ్ముడిపై తన ప్రేమను చాటుతూ బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇదిలావుండగా నాగబాబు కొన్నిరోజుల క్రితం కరోనా భారినపడి కోలుకుని ప్లాస్మా డోనేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా తన బాడీలో ఇంకా యాంటీ బాడీలు డెవలప్ అవ్వడంతో పుట్టినరోజును పునస్కరించుకొని మరోసారి ప్లాస్మా డోనేట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆసుపత్రికి వెళ్లి నాగబాబుకు సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడ ఆ సమయంలో చిరంజీవిను సర్ప్రైజ్ అయిన నాగబాబు అలా సోదరుడును చూడటం సంతోషంగా అనిపించిందని ట్విట్టర్ లో తెలియజేశారు. ఇదంతా చూసి మెగా అభిమానులు సంబర పడుతున్నారు.