
కరోనా లాక్ డౌన్ లో ఎవరు ఎలా ఉన్నారో తెలీదు గాని టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు? ఎలా అంటారా? అమ్మకి వంటలు చేస్తూ, మనవరాలితో డ్యాన్స్ లు వెయిస్తూ, టీవీలకు ఇంటి నుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ, ఇవ్వన్నీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ అభిమానులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. చిరు పెట్టె పోస్ట్లు కొన్ని కడుపుబ్బా నవ్విస్తే, మరికొన్ని దీర్ఘంగా ఆలోచించేలా చేస్తాయి. అయితే తాజా పోస్ట్ మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. అదేంటో తెలుసా? వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా బాస్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దానికి 'నేను తీసిన మొదటి ఫోటోని వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మీతో పంచుకుంటున్నాను' అని క్యాప్షన్ ఇచ్చారు. ఐదుగురు చిన్నపిల్లలు ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పెట్టి, మీకు తెలిసిన ఓ వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు కనుకోండి అని చిరు అన్నారు. అంతే, ఆ ఐదుగురి మధ్యలో ఉంది చిన్నప్పటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని మెగా అభిమానులు కామెంట్స్ చేశారు. చిన్న పవర్ స్టార్ ను అది బ్లాక్ అండ్ ఫోటోలో చూడటం బహుశా ఇదే మొదటిసారేమో! ఇకపోతే చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.