
మెగాస్టార్ చిరంజీవి "ఖైది" సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి స్పీడు మీదున్నారు. తాజాగా భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన "సైరా నరసింహారెడ్డి" చిత్రం రిలీజ్ ఒక మోస్తరు హిట్ గా నిలిచింది. తెలుగులో మంచి వసూళ్లను రాబట్టినా టాక్ మాత్రం ప్రవాలేదనిపించింది. ఇక వేరే భాషల్లో అంతంతమాత్రంగానే ఆడింది. చిరు సైరా గురించి సంతోషపడాల్సింది లేదు అలా అని బాధపడాల్సింది లేదు. ఇక ఇదిలావుంటే సైరా ఫీవర్ నుండి బయటకు వచ్చేసి తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు చిరు. 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా రామ్ చరణే నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2020 ఆగస్టు 14న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సామాజికాంశంతో కూడిన కధ అవ్వటంతో స్వతంత్ర దినోత్సవం వీకెండ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.