
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా రామ్ చరణే నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాడు. మొన్నీమధ్యే చిరు టెస్ట్ లుక్ ను ఓకే చేసిన కొరటాల జనవరి 2 నుంచి షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. కానీ చిరు జనవరి 2న జరగాల్సిన షూట్ కు హాజరుకాలేదు. జనవరి 3కు పోస్ట్ పోన్ చేయమని టీంకు చెప్పారట. అయితే చిరు పోస్ట్ పోన్ చేయటానికి కారణం రాజశేఖర్ తో జరిగిన గోడవేనని తెలుస్తోంది. 'మా' నూతన డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రాజశేఖర్ తనకు విలువ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. తన మాటలను తప్పుపడుతూ రాజశేఖర్ మాట్లాడడాని ఖండించారు. అయితే జరిగిన గొడవ కారణంగా షూటింగ్ చేసే మూడ్ లేకా క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది.