
నవంబర్ 27 అర్ధరాత్రి తొండూపల్లి సమీపంలో వెంటర్నేరి డాక్టర్ దిశను రేప్ చేసి హత్య చేసి అనంతరం కాల్చేసిన ఘటన దేశంను కుదిపేసింది. అత్యాచారంకు పాల్పడ్డ కిరాతకులను మరుసటి రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు జరిగిన సిన్ రికన్స్ట్రాక్షన్ కోసం 10రోజులు సమయం కావాలని కోరి నేడు తెల్లవారుజామున నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లగా అక్కడ నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా నలుగురిని ఎంకౌంటర్ చేయడం జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఎంకౌంటర్ జరిగిన మరుక్షణం నుంచి దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఎంకౌంటర్ పై సినీ ప్రముఖులు సైతం స్పందించారు. "నాకు తెలంగాణ అంటే ఇష్టం. భయం కొన్నిసార్లు అవసరం" అంటూ సమంత ట్వీట్ చేయగా...."న్యాయం జరిగింది" అంటూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అనసూయ, ఉత్తేజ్ ఇలా పలువురు ప్రముఖులు పోలీసులకు అభినందనలు తెలియజేశారు.