
చిన్న వయసులోనే తన చేలాకితనంతో అందరిని ఎంటర్టైన్ చేస్తూ బుల్లితెర నుంచి వెండితెరకు అతితక్కువ టైంలోనే వెళ్లి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. కొన్నాళ్లకు కమేర్షియల్ పైలెట్ ను పెళ్లాడి ఇండోనేసియాకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమెను సోషల్ మీడియాలో చూడటమే తప్ప తెరపై చూసింది లేదు. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తరువాత స్వాతి హైదరాబాద్ కు తిరిగి వచ్చి కెరియర్ ను ప్రారంభించబోతుంది. కాకపోతే అది వెండితెరపై కాదు, బుల్లితెర మీద. ఓ ప్రముఖ ఓటీటీలో వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను ఓ ప్రముఖ దర్శకుడు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ చూడని పాత్రలో స్వాతి కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ తో స్వాతి కూడా డిజిటల్ దునియా లోకి అడుగుపెట్టేస్తుంది.