
టాలీవుడ్ లో 5 దశాబ్దాల పాటుగా స్టార్ కమెడియన్ గా కొనసాగుతూ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సినిమాల్లో, ఈవెంట్స్ లో, ఇప్పుడు బుల్లి తెరపై హోస్ట్ గా బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి జైతున్ బీబీ రాజమండ్రిలో అనారోగ్యంతో బాధపడుతూ గతకొంతకాలంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేడు రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో జైతున్ బీబీ తుది శ్వాస విడిచారు. షూటింగ్ నిమిత్యం జార్ఖండ్ లో ఉన్న అలీ తల్లి మరణవార్త తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుండి రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. ఎన్నో సందర్భాల్లో తన తల్లి గురించి చెప్పి భావోద్వేగానికి లోనైన అలీ ఇక తల్లి లేదని తెలియడంతో గుక్కపెట్టి ఏడ్చారట. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో జైతున్ అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.