
బాలీవుడ్ మరియు టాలీవుడ్ నుండి ప్రముఖులు ముందుకు వచ్చి వారి అభిమానులు, నెటిజన్లు ఛాలెంజింగ్ పరిస్థితుల్లో ఉన్నారని, సురక్షితంగా ఉండాలని కోరారు. ఘోరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రం ఆచార్య షూటింగ్‌ను కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి అనేక తెలుగు తారలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో తమ అభిమానులను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే తన రాబోయే రొమాంటిక్ చిత్రం 'ఓ డియర్' షూటింగ్ కోసం ప్రభాస్ ఇటీవల జార్జియాకు వెళ్లారు,కానీ సిటీకి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఘోరమైన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఓ డియర్ చిత్రీకరణ ఆగిపోయిందని తెలుస్తోంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో, కోవిడ్ -19 మహమ్మారిని జయించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని కోరారు.