
పూనమల్లి సమీపంలోని "ఇండియన్ 2" షూటింగ్ స్థలంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇద్దరు మరణించారు. నజరత్పేట్లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. కమల్ హాసన్ నటిస్తున్న చిత్ర షూటింగ్ కోసం ఉపయోగించిన క్రేన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, కార్మికులు ఒక సన్నివేశానికి సెట్ ను ఏర్పాటు చేయటంలో నిమగ్నమయ్యారు...ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్రేన్లో మౌంట్ చేయబడిన భారీ లైట్ కూడా పడిపోయింది. అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. మరణించినవారు, 34 ఏళ్ల అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న 29 ఏళ్ల మధు, స్టాఫ్ లో ఒకరైన చంద్రన్ గా గుర్తించ్చారు. సెట్ లొనే ఉన్న కమల్ హస్సన్ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.