
హైదరాబాద్ లో కొత్తగా ప్రారంభమైన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నుండి ఒక కారు అదుపుతప్పి కింద పడింది. దానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలిసులు తాజాగా రిలీజ్ చేశారు. ఫుటేజ్ చూస్తే అర్ధం అవుతుంది...ఎంత ఘోర ప్రమాదమో. కారు కిందపడిన సమయంలో అక్కడే ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. మరణించిన మహిళ సత్యవాణిగా గుర్తించారు. సత్యవాణితో ఆమె కూతురు కూడా ఆ సమయంలో అక్కడే ఉండగా...ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ముగ్గురు, కిందపడిన సమయంలో ముగ్గురు మొత్తంగా ఆరుగురు ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుసుతుంది. వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెండో ప్రమాదం జరిగింది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.