
దీపికా విత్ ప్రభాస్ అంటూ న్యూస్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో… అప్పట్నుంచీ సోషల్ మీడియా ఫుల్లుగా ఎగ్జైట్ అయిపోతోంది. దీపికకి మాత్రం… ‘ప్రభాస్ 21’ అనే ప్రచారం నచ్చినట్టు కనిపించటం లేదు! హాలీవుడ్ సినీ మ్యాగజైన్ ‘వెరైటీ’… ప్రభాస్, దీపిక సినిమా చేయబోతున్నారని అఫీషియల్ గా ప్రకటించింది. ఆ ట్వీట్ లో ‘ప్రభాస్21’ అంటూ ప్రాజెక్ట్ పేరును పేర్కొనటం జరిగింది. కాకపోతే, అనూహ్యంగా ఈ విషయంలో దీపికా పదుకొణే హర్టైంది! ఆమె వెరైటీ మ్యాగజైన్ వార్ని ట్యాగ్ చేస్తూ ‘సినిమా పేరు ‘ప్రభాస్21’ కాదు…’ప్రభాస్ యొక్క 21వ చిత్రం’ మాత్రమే’ అని చెప్పింది! చూడబోతే తాను కూడా సూపర్ స్టార్ అయినప్పుడు ఓన్లీ ప్రభాస్ ను హైలైట్ చేస్తూ ‘ప్రభాస్21’ అనటం దీపూకి నచ్చినట్టు లేదు. మరి ముందు, ముందు ‘బాహుబలి’తో ఈ బాలీవుడ్ బ్యూటీ ఎలా సర్దుకుపోతుందో!