
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. పద్మావత్ ఫేమ్ నటి ఇప్పుడు బి టౌన్ లోనే అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. దీపికా పదుకొనే 2007 లో ఓం శాంతి ఓం చిత్రంతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2020 సంవత్సరంలో, లూయిస్ విట్టన్ ఫ్యాషన్ కంపెనీ కోసం ప్రచారం చేసిన మొదటి భారతీయ నటి దీపికా. తాజా సమాచారం ప్రకారం, దీపికా పదుకొనే ఆదాయాలు సుమారు 68 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. అంటే, సుమారుగా సంవత్సరానికి 7 కోట్లు. అంతేకాదు ఆమె ఒక్కో చిత్రానికే 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తాజాగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ తో దీపికా జతకట్టనున్న విషయం తెలిసిందే. మహానటి లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ 21వ చిత్రంలో దీపికా కథానాయికగా నటిస్తుంది.