
ప్రభాస్ తో దీపిక అని ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో అందరూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా లెవల్ కు పెరిగిన ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హీరోయిన్ ఉండాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునెను తీసుకున్నారు. ఈ సినిమాలో చేసేందుకు దీపిక ఏకంగా రూ. 30 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను తీసుకుంది. అయితే తాజా సమాచారం నిజమైతే, ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపిక డ్యాన్సర్ గా కనిపించన్నుట్లు తెలుస్తుంది. ఈమెపైనే కథ ఆదారపడి ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రాధే శ్యామ్' సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.