
బాలీవుడ్ లోనే కాక భారతదేశంలో అందరూ ఇష్టపడే, సోషల్ మీడియాలో బాగా ఫాలో అయ్యే జంటల్లో రణ్వీర్ సింగ్- దీపిక పదుకునెలు ఉంటారు. వారు ఏమి చేసిన వైరల్ అవుతుంది. అయితే ఈ కరోనా లాక్డౌన్ సమయంలో సెలెబ్రిటీలు అందరూ వంటలు చేయటమో, మొక్కలను పెంచటమో లేదా భర్తలకు కటింగ్లు చేయటమో పనిగా పెట్టుకున్నారు. ఈ ట్రెండ్ ను మొదటగా విరాట్-అనుష్కలు మొదలుపెట్టగా దాన్ని సోనమ్ కూడా ఫాలో అయింది. ఇప్పుడు దీపిక వంతు వచ్చింది. భర్త రణ్వీర్ సింగ్ కు కటింగ్ చేసి దాన్ని స్టైల్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.