
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ చలన చిత్ర పరిశ్రమ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. అయితే, అన్న భాటలోనే నేను నడుస్తా అంటూ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కమర్షియల్ గా హిట్ అవనప్పటికీ మంచి ప్రశంసలు దక్కించుకుంది. అయితే, ఆనంద్ దేవరకొండ తన తదుపరి సినిమాను ప్రకటించాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు వినోద్ ఆనంతోగు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఆనంద్ కు సక్సెస్ తెచ్చి పెడుతుందేమో చూద్దాం.