
దేవి నాగవల్లి, పేరుగాంచిన తెలుగు న్యూస్ రీడర్లలో ఒకరు. ఆమె బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో బలయమైన పోటీదారులలో ఒకరిగా ప్రవేశించారు. కానీ దురదృష్టవశాత్తు, ఆమె మూడవ వారం తరువాత బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినెట్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే దేవికి పెళ్లై 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఏవో మనస్పర్థలు కారణంగా దేవి ఆమె భర్తతో విడిపోయారు. ఈమేరకు బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమెను రెండో పెళ్లి గురించి అడగగా...సూటిగా సమాధానం ఇచ్చారు. 'ఎందుకు చేసుకొను? నచ్చిన వ్యక్తి, నన్ను అర్థం చేసుకొని, నా నిర్ణయాలకు గౌరవం ఇచ్చే అతను వస్తే కచ్చితంగా చేసుకుంటాను. కానీ నా భయమంత నా కొడుకు కార్తికేయ గురించే. నా జీవితంలో మరో వ్యక్తి వస్తే అతన్ని కార్తికేయ అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదని ముక్కుసూటిగా చెప్పింది. మరి దేవికి నచ్చే వ్యక్తి త్వరగా ఆమెకు కనపడాలని కోరుకుందాం.