
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు" చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ప్రారంభించేసింది. అందులో భాగంగా ప్రతి సోమవారం సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని తెలిపిన బృందం ఈ సోమవారం 'మైండ్ బ్లాక్' అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. దేవిశ్రీప్రసాద్ కంపోస్ చేసిన ఈ పాట ప్రేక్షకులనే కాదు మహేష్ ఫ్యాన్స్ ను సైతం నిరాశపరిచింది. ఈమధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాటలను తామే కాపీ కొట్టుకుంటున్నారు. దేవి కూడా అదే పని చేశాడని సోషల్ మీడియాలో మైండ్ బ్లాక్ పాటపై ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు. దేవి మ్యూజిక్ అందించిన "నేను శైలజ" చిత్రంలోని "శైలజ శైలజ" పాటకు కొంచెం ఫాస్ట్ బిట్ జోడించి మైండ్ బ్లాక్ పాటను కంపోజ్ చేసారని దేవిని ఆడేసుకుంటున్నారు.