
2020లో వరుస సినిమాలతో వెండితెరపై తనదైన ముద్ర వేసుకోనుంది నటి పూజ హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజ ఆ తర్వాత తన నటనా, అందం, అభినయంతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ తో అల..వైకుంఠపురంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక మరోపక్క రెబెల్ స్టార్ ప్రభాస్ కు జంటగా రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జాన్" సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రెగులర్ షూటింగ్ ఈ నెల నుంచి మొదలు కానుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ... తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చింది. అలానే ఒక సందర్భంలో 'ప్రభాస్ మీకు ప్రపోజ్ చేస్తే, ఎం చేస్తారు?' అని నెటీజన్ అడిగినట్లు చెప్పింది. ఒకోసారి ఫ్యాన్స్ చాలా చిలిపి ప్రశ్నలు అడుగుతుంటారని అలాంటి వాటికి సమాధానం ఉండదని తెలిపింది.