
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 షోలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. షోలో వీళ్లు పండించిన కెమిస్ట్రీ అలాంటిది మరి. ఓం స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ ఇద్దరు బయటకు వచ్చి మా మధ్య అలాంటిదేమి లేదని చెప్పిన నమ్మే వారు లేరు. అందుకే దీన్ని క్యాష్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి కెరియర్లలో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి ముఖ్యంగా రాహుల్ కెరియర్ ప్రస్తుతం ఫిక్స్ లో ఉంది. ఒక పక్క పాటలు పాడుతూనే మరో పక్క నటుడిగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో రాహుల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలావుండగా తాజాగా రాహుల్ పునర్నవి పేరెంట్స్ ను కలవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో స్వయంగా రాహుల్ షేర్ చేస్తూ "మేము ఇద్దరం కలిసి చేయబోయే ప్రైవేట్ ఆల్బమ్ కోసం పర్మిషన్ ఆడిగేందుకు కలిశానని" తెలిపాడు.