
సమంత "ది గోల్డెన్ హార్ట్" అని మరోసారి రుజువైంది. సామ్, తన అసిస్టెంట్ ఆర్యన్ పట్ల నడుచుకున్న తీరుపై వివిధ మూలల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. వివరాల్లోకి వెళితే, సమంత తన అసిస్టెంట్ ఆర్యన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఆమె పర్సనల్ గా హాజరై రిబ్బన్ కట్ వేడుకలో పాల్గొంది. సామ్ తన విలువైన సమయంలో కాసేపు అసిస్టెంట్ కోసమే కేటాయించింది. ఈ రెస్టారెంట్ వ్యాపారాన్ని తన పార్ట్‌టైమ్ బిజినెస్‌గా ప్రారంభించిన తన అసిస్టెంట్ ఆర్యన్ కు సామ్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా సమంత మీడియాతో కూడా మాట్లాడారు. ఆర్యన్ తనతో 11 సంవత్సరాల నుండి పనిచేస్తున్నట్లు, అతను తన అప్స్ అండ్ డౌన్స్ లో కూడా ఉన్నాడని తెలిపింది. అతను చాలా ప్రతిభావంతుడు మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి అని....అతనికి అన్ని విధాలా శుభాకాంక్షలు తెలిపింది. సామ్ యొక్క ఈ చర్య నిజంగా ప్రశంసనీయం. దీని ద్వారా సామ్ నిజంగానే గోల్డెన్ హార్ట్ లేడీ అని మరోసారి నిరూపించుకుంది.