
మీడియా మరియు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దిల్ రాజు త్వరలో కొత్త ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు తన సొంత స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించడం ద్వారా ఆహా, ఎల్.టి. బాలాజీ, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ పోటీదారుగా మారబోతున్నారు. ఏక్తా కపూర్ వంటి చాలా మంది బాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే ఎల్.టి.బాలాజీ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రారంభించారు. వారి సొంత కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించారు. అల్లు అరవింద్ కూడా 'ఆహా' అనే ఓటీటీ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. ప్రస్తుతం, ఆహాలో గీతా ఆర్ట్స్ యొక్క కొన్ని పాత బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 'ఆహా' మాదిరిగానే దిల్ రాజు కూడా తన సొంతఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.