
దిల్ రాజు మరియు అనిల్ రవిపుడి కాంబోలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సక్సెస్ లో మునిగిపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రశ్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతంగా నడుస్తుంది. ప్రస్తుతం దిల్ రాజు తన రాబోయే ప్రాజెక్ట్, పింక్ రీమేక్‌లో బిజీగా ఉన్నాడు. దీనిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే దిల్ రాజు తన డైరెక్టర్ రాబోయే ప్రాజెక్టుల తారాగణం మీద నోరు విప్పకుండా ఉండాలని కోరుకుంటున్నారట. దిల్ రాజు వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ దగ్గుబాటి నటించిన F2 కు సీక్వెల్ F3 ను తానే ప్రొడ్యూస్ చేసే ఆలోచనల్లో ఉన్నారుట. F3లో మాస్ మహారాజ రవితేజ ఉన్నారనే రూమర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అయితే దిల్ రాజు అనిల్ రావిపూడికి F3కి సంబంధించిన తారాగణం గురించి చెప్పొద్దని, సర్ప్రైజ్ గా ఉంచాలని సూచించారట.